ఐదు మ్యాచులు ఆడితే వరుసగా నాలుగు ఓటములు. మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ పై 286 పరుగులు కొట్టి..ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్..ఈ సీజన్ లో 300 రికార్డును బ్రేక్ చేసేస్తుంది లే అనుకుంటే...అక్కడ మొదలు వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయి ఈ సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతానికి అట్టడుగున ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయి పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు పిచ్చ ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ను ఉప్పల్ లో ఎలా ఎదుర్కోనుంది అనేది ఇంట్రెస్టింగ్ ఈ రోజు. లీగ్ లోో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన పంజాబ్...రాజస్థాన్ లో చేతిలో మాత్రమే ఓడి గుజరాత్, లక్నో, చెన్నై లాంటి మేటిజట్లకు షాకులు ఇచ్చింది. ప్రధానంగా పంజాబ్ ఓపెనర్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్యపైనే అందరి కళ్లు ఉన్నాయి. చెన్నైతో మ్యాచ్ లో సెంచరీ కొట్టి తుక్కు రేగొట్టిన ఆర్య...ఉప్పల్ పిచ్ లో తెలుగు టీమ్ కు ఆర్య 2 సినిమా చూపిస్తాడా అనే భయం నెలకొంది. ఆర్యకి తోడు కెప్టెన్ శ్రేయస్, మిడిల్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ ఉన్న ఫామ్ సన్ రైజర్స్ కి కచ్చితంగా చెమటలు పట్టించేదే. స్టాయినిస్, మాక్స్ వెల్, మార్కో జాన్సస్ క్వాలిటీ ఆల్ రౌండర్స్...చాహల్, అర్ష్ దీప్, లోకీ ఫెర్గ్యూసన్ లాంటి నమ్ముకోదగిన బౌలర్స్ తో పంజాబ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మన సైడు కాటేరమ్మ కొడుకులు ఎలా ఆడతారనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అనికేత్ బ్యాటింగ్ లో దుమ్ము రేపితే బౌలింగ్ సంగతి చూసుకోవాటనికి కమిన్స్, షమీ, జీషన్ అన్సారీ ఉన్నారు. చూడాలి మరి పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసిరి పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందో..లేదో ఐదో ఓటమిని మూటగట్టుకుని చెన్నైకి తోడుగా ఉంటుందో ఈ రోజు రాత్రికి తేలిపోనుంది.